ICC World Cup 2019: Hashim Amla In Line To Break Virat Kohli's ODI Record | Oneindia Telugu

2019-05-30 149

ICC World Cup 2019:The stage is set for the ICC World Cup 2019 to take as England goes up against South Africa in the tournament opener at the Kennington Oval in London on May 30 (Thursday). Meanwhile, veteran Proteas batsman Hashim Amla is in line to break Virat Kohli's ODI record.
#iccworldcup2019
#hashimamla
#viratkohli
#msdhoni
#rohitsharma
#cricket
#southafricacricketteam

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న రోజు రానే వచ్చింది. మరికొన్ని గంటల్లోనే ఇంగ్లాండ్‌ వేదికగా వన్డే వరల్డ్‌కప్ ఆరంభం కానుంది. టోర్నీలో భాగంగా ఆరంభ మ్యాచ్‌లో ఇంగ్లాండ్-దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి.
ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి చెందిన ఓ రికార్డుకి దక్షిణాఫ్రికా ఆటగాడు హషీమ్ ఆమ్లా చేరువయ్యాడు. దక్షిణాఫ్రికాతో మధ్యాహ్నాం 3 గంటలకు ఆరంభమయ్యే ఈ మ్యాచ్‌లో ఆమ్లా మరో 90 పరుగులు చేస్తే వన్డేల్లో అత్యంత వేగంగా 8వేల పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు.
విరాట్ కోహ్లీ వన్డేల్లో 8వేల పరుగుల మైలరాయిని 175 ఇన్నింగ్స్‌లో అందుకోగా ఆమ్లా 171 ఇన్నింగ్స్‌లో 7910 పరుగులు సాధించాడు. దీంతో పాటు వన్డేల్లో రెండు వేలు, మూడు వేలు, నాలుగు వేలు, ఐదు వేలు, ఆరు వేలు, ఏడు వేల పరుగులను ఆమ్లానే అత్యంత వేగంగా అందుకున్న రికార్డుని సొంతం చేసుకున్నాడు.